Skip to main content

Measles and Rubella Champion Award: భారత్‌కు మీజిల్స్, రుబెల్లా ఛాంపియన్‌ అవార్డు

 Union Health Departmentstatement   Measles and Rubella Champion Award for India    India awarded Measles Rubella Champion Award

భారత్‌కు ప్రతిష్టాత్మక మీజిల్స్, రుబెల్లా ఛాంపియన్‌ అవార్డు లభించింది. తట్టు(మీజిల్స్‌), రుబె­ల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్‌ చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథన్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్‌ఓ), అమెరికన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థలతోపాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. దేశంలో ఈ అంటువ్యాధులను నియంత్రించే దిశగా చేసిన ప్రయత్నాల ఫలితంగా గత ఏడాదిలో 50 జిల్లాల్లో ఒక్క తట్టు కేసు, 226 జిల్లాల్లో ఒక్క రుబెల్లా కేసు కూడా బయటపడలేదని ప్రకటనలో వివరించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Mar 2024 03:55PM

Photo Stories