Skip to main content

జనవరి 2021 అవార్డ్స్

ఆంధ్రప్రదేశ్‌కు రెండు పోలీస్ శౌర్య పతకాలు
Current Affairs
దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పోలీస్ శౌర్య పతకాలు, ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకంతో పాటు 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఏఏసీ ర్యాంకు అధికారి గొంగటి గిరీష్ కుమార్, జేసీ ర్యాంకు అధికారి కూడుపూడి హరికృష్ణకు పోలీసు శౌర్య పతకాలు వచ్చాయి. విజయవాడ ఏసీబీ అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాథుర్తి శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం దక్కింది.
తెలంగాణకు...
తెలంగాణ రాష్ట్రానికి రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్, నిజామాబాద్ ఐజీ శివశంకర్‌రెడ్డి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను దక్కించుకున్నారు.

బాల్ శక్తి పురస్కారాలు-2021
అసాధారణమైన సామర్థ్యాల ఆవిష్కరణలు, విద్యావిషయక విజయాలు, క్రీడలు, కళలు-సంస్కృతి, సామాజిక సేవ, ధైర్యం వంటి రంగాలలో విశేషమైన విజయాలు సాధించిన చిన్నారులకు ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కింద బాల్ శక్తి పురస్కారాల’ను ప్రదానం చేస్తోంది. ఈ అవార్డుకు 2021 ఏడాది వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 32 మంది చిన్నారులు ఎంపికయ్యారు. అవార్డు విజేతలకు ఒక పతకంతో పాటు, రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు.
ఇద్దరు తెలుగు చిన్నారులు...
2021 ఏడాది బాల్ శక్తి పురస్కాలకు ఇద్దరు తెలుగు చిన్నారులు ఎంపికయ్యారు. వీరిద్దరిలో విశాఖ నగరంలోని లాసన్స్ బే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలిక అమేయ లగుడు కాగా, మరోకరు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు చదలవాడ హేమేష్.
అమేయ: శాస్త్రీయ నృత్యంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను అమేయకు బాల్ శక్తి పురస్కార్ దక్కింది. నాలుగేళ్ల వయసు నుంచి అమేయ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటోంది. ఇప్పటికే 8 అంతర్జాతీయ, 9 జాతీయ అవార్డులు, 18 రాష్ట్రస్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, సిలికానాంధ్ర సంస్థ 6,117 మందితో ఏర్పాటు చేసిన అతిపెద్ద కూచిపూడి నృత్య కార్యక్రమంలో భాగమై గిన్నిస్ రికార్డు సైతం సాధించింది.
హేమేష్: అల్జీమర్స్‌తో బాధపడుతున్న తన అమ్మమ్మ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు హేమేష్ తయారు చేసిన స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ పతకాన్ని తెచ్చిపెట్టింది. రోగుల పల్స్, రక్తపోటును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైనప్పుడు డాక్టర్‌తోపాటు సంరక్షకులకు స్మార్డ్ రిస్ట్ బ్యాండ్ అలర్ట్ పంపిస్తుంది. రోగి ఆరోగ్య స్థితిని ప్రదర్శించడమే కాకుండా, రోజువారీ నివేదికలను ఆటోమేటిక్‌గా పంపిస్తుంది.
బాల్ శక్తి పురస్కారాలు-2021

సంఖ్య

పేరు

రాష్ట్రపతి

విభాగం

1

అమేయ లగుడు

ఆంధ్రప్రదేశ్

కళలు, సంస్కృతి

2

వ్యోమ్ అహుజా

ఉత్తరప్రదేశ్

కళలు, సంస్కృతి

3

హృదయ ఆర్ కృష్ణన్

కేరళ

కళలు, సంస్కృతి

4

అనురాగ్ రామోలా

ఉత్తరాఖండ్

కళలు, సంస్కృతి

5

తనూజ్ సమద్దర్

అస్సాం

కళలు, సంస్కృతి

6

వెనిష్ కీషమ్

మణిపూర్

కళలు, సంస్కృతి

7

సౌహర్ద్య దే

పశ్చిమ బెంగాల్

కళలు, సంస్కృతి

8

జ్యోతి కుమారి

బీహార్

ధైర్యం

9

కున్వర్ దివ్యాన్ష్ సింగ్

ఉత్తరప్రదేశ్

ధైర్యం

10

కామేశ్వర్ జగన్నాథ్ వాగ్మారే

మహారాష్ట్ర

ధైర్యం

11

రాకేశ్‌కృష్ణ కె

కర్ణాటక

ఆవిష్కరణ

12

శ్రీ‌నాబ్ మౌజేష్ అగర్వాల్

మహారాష్ట్ర

ఆవిష్కరణ

13

వీర్ కశ్యప్

కర్ణాటక

ఆవిష్కరణ

14

నామ్య జోషి

పంజాబ్

ఆవిష్కరణ

15

ఆర్కిత్ రాహుల్ పాటిల్

మహారాష్ట్ర

ఆవిష్కరణ

16

ఆయుష్ రంజన్

సిక్కిం

ఆవిష్కరణ

17

హేమేష్ చదలవాడ

తెలంగాణ

ఆవిష్కరణ

18

చిరాగ్ భన్సాలీ

ఉత్తరప్రదేశ్

ఆవిష్కరణ

19

హర్మన్‌జోత్ సింగ్

జమ్మూ,కశ్మీర్

ఆవిష్కరణ

20

మొహద్ షాదాబ్

ఉత్తరప్రదేశ్

విద్య

21

ఆనంద్

రాజస్థాన్

విద్య

22

అన్వేష్ శుభం ప్రధాన్

ఒడిశా

విద్య

23

అనుజ్ జైన్

మధ్యప్రదేశ్

విద్య

24

సోనిత్ సిసోలేకర్

మహారాష్ట్ర

విద్య

25

ప్రసిద్ధి సింగ్

తమిళనాడు

సామాజిక సేవ

26

సవితా కుమారి

జార్ఖండ్

క్రీడలు

27

అర్షియా దాస్

త్రిపుర

క్రీడలు

28

పాలక్ శర్మ

మధ్యప్రదేశ్

క్రీడలు

29

మహ్మద్ రఫీ

ఉత్తరప్రదేశ్

క్రీడలు

30

కామ్య కార్తికేయన్

మహారాష్ట్ర

క్రీడలు

31

ఖుషి చిరాగ్ పటేల్

గుజరాత్

క్రీడలు

32

మంత్ర జితేంద్ర హర్ఖని

గుజరాత్

క్రీడలు

ప్రధాన్ మంత్రి రాష్టీయ్ర బాల్ పురస్కార్
ఏటా రిపబ్లిక్ డే (జనవరి 26) ముందు వారంలో ఈ అవార్డులను భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఈ అవార్డులను రెండు కేటగిరీల కింద ఇస్తారు. అవి..
1.బాల్ శక్తి పురస్కార్
2.బాల్ కల్యాణ్ పురస్కార్
బాల్ శక్తి పురస్కార్:
వివిధ రంగాలలో అసాధారణమైన విజయాలను సాధించిన 18 ఏళ్లలోపు పిల్లలకు ఏటా భారత ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. ఈ అవార్డును 1996లో జాతీయ చైల్డ్ అవార్డు ఫర్ ఎక్స్‌ప్షనల్ అచీవ్‌మెంట్ పేరుతో స్థాపించారు. 2018 నుంచి బాల శక్తి పురస్కార్ అని పేరు మార్చారు.
బాల్ కల్యాణ్ పురస్కార్:
  • పిల్లల అభివృద్ధి, రక్షణ, శిశు సంక్షేమ రంగాలలో పిల్లల మంచి కోసం చేసిన విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డు ఇస్తారు.
  • భారతీయ పౌరుడు, భారతదేశంలో నివసిస్తున్న 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి (సంబంధిత సంవత్సరం ఆగస్టు 31 నాటికి) ఉండాలి. వారు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పిల్లల ప్రయోజనాల కోసం పని చేసి ఉండాలి.


మహావీరచక్ర పురస్కారం-2021 విజేత?
భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబును మహావీరచక్ర పురస్కారం వరించింది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.
2019 కల్నల్‌గా...
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రం సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్‌బాబు 1983, ఫిబ్రవరి 13న జన్మించారు. నేషనల్ ఢిపెన్స్ అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. 2004 డిసెంబర్‌లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్‌లో కల్నల్‌గా పదోన్నతి పొందారు. బిహార్ 16వ రెజిమెంట్ కామాండింగ్ అధికారిగా ఉన్న సమయంలో.. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో 2020, జూన్ 15న వీరమరణం పొందారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా కల్నల్ సంతోష్‌బాబు విధులు నిర్వహించాడు.
సైనిక పురస్కారాలు-2021 జాబితా
మహావీర్‌చక్ర: బి.సంతోష్ బాబు (కల్నల్ )
కీర్తిచక్ర : సంజీవ్‌కుమార్ (సుబేదార్), పింటూకుమార్ (సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్), శ్యాంనారాయణ్ సింగ్ యాదవ్ (సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్), వినోదకుమార్ (సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్), రాహుల్ మాథుర్ (సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్)
వీర్‌చక్ర: నుదూరామ్ సోరెన్ (నాయబ్ సుబేదార్), కె.పళని (హవల్దార్), తేజీందర్‌సింగ్ (హవల్దార్), దీపక్‌సింగ్ (నాయక్), గురుతేజ్ సింగ్ (సిపాయి)
శౌర్యచక్ర: అనూజ్ సూద్ (మేజర్), ప్రణబ్‌జ్యోతి దాస్ (రైఫిల్‌మ్యాన్), సోనమ్ శెరింగ్ తమాంగ్ (పారాట్రూపర్), అర్షద్ ఖాన్ (ఇన్‌స్పెక్టర్ - జమ్మూకశ్మీర్), ముస్తాఫా బారా (ఎస్‌జీసీటీ -జమ్మూకశ్మీర్), నజీర్ అహ్మద్ కోలీ (ఎస్‌జీసీటీ - జమ్మూకశ్మీర్), బిలాల్ అహ్మద్ మాగ్రే (స్పెషల్ పోలీసు ఆఫీసర్- జమ్మూకశ్మీర్)
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహావీరచక్ర పురస్కారం-2021 విజేత
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : కల్నల్ సంతోష్‌బాబు
ఎందుకు : యుద్ధ సమయంలో అసాధారణ సాహసం, శౌర్యం, తెగువ చూపినందున

పద్మ పురస్కారాలు-2021
కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన 119 మందికి భారత ప్రభుత్వం జనవరి 25న 2021 సంవత్సరానికి గానూ ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
29 మంది మహిళలు...
2021 ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. అలాగే విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మంది, ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి...
2021 ఏడాది పద్మ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారు.
ఆశావాది ప్రకాశరావు(ఏపీ): రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన ఆశావాది... పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు.
అన్నవరపు రామస్వామి(ఏపీ): విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు(వయోలిన్) అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గా అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు.
నిడుమోలు సుమతి(ఏపీ): భారతీయ సంగీత వాయిద్యరంగంలో మృదంగవాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి నిడుమోలు సుమతి(దండమూడి సుమతీ రామమోహనరావు)ని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. విజయవాడకు చెందిన సుమతి పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు.
కనకరాజు(తెలంగాణ): కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కళాకారుడు కనకరాజును పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న 60 ఏళ్ల రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు.
పద్మ పురస్కారాలు-2021
పద్మ విభూషణ్ విజేతలు (7)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

షింజో అబే

ప్రజా వ్యవహారాలు

జపాన్

2

ఎస్.పి.బాలసుబ్రమణ్యం

కళలు

తమిళనాడు

3

డా. బెల్లె మొనప్ప హెగ్డే

వైద్యం

కర్ణాటక

4

నరీందర్ సింగ్ కపానీ

సైన్స్, ఇంజనీరింగ్

యూఎస్

5

మౌలానా వాహిదుద్దీన్ ఖాన్

ఆధ్యాత్మికత

ఢిల్లీ

6

బి.బి.లాల్

ఆర్కియాలజీ

ఢిల్లీ

7

సుదర్శన్ సాహూ

కళలు

ఒడిషా

పద్మ భూషణ్ విజేతలు (10)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

1

కె.ఎస్.చిత్ర

కళలు

కేరళ

2

తరుణ్ గొగోయ్

ప్రజా వ్యవహారాలు

అసోం

3

చంద్రశేఖర్ కంబర

సాహిత్యం

కర్ణాటక

4

సుమిత్ర మహాజన్

ప్రజా వ్యవహారాలు

మధ్యప్రదేశ్

5

నృపేంద్ర మిశ్రా

సివిల్ సర్వీస్

ఉత్తర ప్రదేశ్

6

రామ్ విలాస్ పాశ్వాన్

ప్రజా వ్యవహారాలు

బిహార్‌

7

కేశుభాయ్ పటేల్

ప్రజా వ్యవహారాలు

గుజరాత్

8

కల్బే సాదిక్

ఆధ్యాత్మికత

ఉత్తర ప్రదేశ్

9

రజనీకాంత్ దేవిదాస్ షరాఫ్

వాణిజ్యం, పరిశ్రమలు

మహారాష్ట్ర

10

తార్‌లోచన్ సింగ్

ప్రజా వ్యవహారాలు

హరియాణా

పద్మ శ్రీ విజేతలు (102)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

1

గల్ఫామ్ అహ్మద్

కళలు

ఉత్తర ప్రదేశ్

2

పి. అనితా

క్రీడ‌లు

తమిళనాడు

3

రామ స్వామి అన్నవరాపు

కళలు

ఆంధ్రప్రదేశ్

4

సుబ్బూ అరుముగం

కళలు

తమిళనాడు

5

ఆశావాది ప్రకాశరావు

సాహిత్యం, విద్య

ఆంధ్రప్రదేశ్

6

భూరి బాయి

కళలు

మధ్యప్రదేశ్

7

రాధే శ్యామ్ బార్లే

కళలు

ఛత్తీస్‌గఢ్

8

ధర్మ నారాయణ బార్మా

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

9

లఖిమి బారువా

సామాజిక సేవ

అస్సాం

10

బిరెన్ కుమార్ బసక్

కళలు

పశ్చిమ బెంగాల్

11

రజనీ బెక్టర్

వాణిజ్యం, పరిశ్రమలు

పంజాబ్

12

పీటర్ బ్రూక్

కళలు

యునెటైడ్ కింగ్‌డమ్

13

సంఘుమి బ్యూల్చువాక్

సామాజిక సేవ

మిజోరాం

14

గోపిరామ్ బార్గైన్ బురభాకట్

కళలు

అస్సాం

15

బిజోయ చక్రవర్తి

ప్రజా వ్యవహారాలు

అస్సాం

16

సుజిత్ చటోపాధ్యాయ

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

17

జగదీష్ చౌదరి(మరణానంతరం)

సామాజిక సేవ

ఉత్తర ప్రదేశ్

18

సుల్టిమ్ర్‌ చోంజోర్

సామాజిక సేవ

లద్దాఖ్

19

మౌమా దాస్

క్రీడ‌లు

పశ్చిమ బెంగాల్

20

శ్రీ‌కాంత్‌ డాటర్

సాహిత్యం, విద్య

అమెరికా

21

నారాయణ్ దేబ్నాథ్

కళలు

పశ్చిమ బెంగాల్

22

చుట్ని దేవి

సామాజిక సేవ

జార్ఖండ్

23

దులారి దేవి

కళలు

బీహార్

24

రాధే దేవి

కళలు

మణిపూర్

25

శాంతి దేవి

సామాజిక సేవ

ఒడిశా

26

వయన్ డిబియా

కళలు

ఇండోనేషియా

27

దాదుదన్ గాధవి

సాహిత్యం, విద్య

గుజరాత్

28

పరశురామ్ ఆత్మారామ్ గంగవనే

కళలు

మహారాష్ట్ర

29

జై భగవాన్ గోయల్

సాహిత్యం, విద్య

హరియాణ

30

జగదీష్ చంద్ర హాల్డర్

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

31

మంగల్ సింగ్ హజోవరీ

సాహిత్యం, విద్య

అస్సాం

32

అన్షు జంసేన్పా

క్రీడ‌లు

అరుణాచల్ ప్రదేశ్

33

పూర్ణమాసి జానీ

కళలు

ఒడిశా

34

మాతా బి. మంజమ్మ

జోగతి కళలు

కర్ణాటక

35

దామోదరన్ కై తప్రమ్

కళలు

కేరళ

36

నామ్‌డియో సి కాంబ్లే

సాహిత్యం, విద్య

మహారాష్ట్ర

37

మహేష్‌భాయ్ -నరేష్‌భాయ్ కనోడియా (ద్వయం)(మరణానంతరం)

కళలు

గుజరాత్

38

రజత్ కుమార్ కర్

సాహిత్యం, విద్య

ఒడిశా

39

రంగసామి లక్ష్మీనారాయణ కశ్యప్ సాహిత్యం,

విద్య

కర్ణాటక

40

ప్రకాష్ కౌర్

సామాజిక సేవ

పంజాబ్

41

నికోలస్ కజనాస్

సాహిత్యం, విద్య

గ్రీస్‌

42

కె కేశవసామి

కళలు

పుదుచ్చేరి

43

గులాం రసూల్ ఖాన్

కళలు

జమ్మూ, కశ్మీర్

44

లఖా ఖాన్

కళలు

రాజస్థాన్

45

సంజిదా ఖాతున్

కళలు

బంగ్లాదేశ్

46

వినాయక్ విష్ణు ఖేదేకర్

కళలు

గోవా

47

నిరు కుమార్

సామాజిక సేవ

ఢిల్లీ

48

లజవంతి

కళలు

పంజాబ్

49

రత్తన్ లాల్

సైన్స్ అండ్ ఇంజనీరింగ్

అమెరికా

50

అలీ మణిక్‌ఫాన్

ఇతరులు-గ్రాస్‌రూట్స్‌ ఇన్నోవేషన్

లక్షద్వీప్

51

రామచంద్ర మంజి

కళలు

బిహార్

52

దులాల్ మంకి

కళలు

అస్సాం

53

నానాడ్రో బి మరక్

ఇతరులు- వ్యవసాయం

మేఘాలయ

54

రెబెన్ మషంగ్వా

కళలు

మణిపూర్

55

చంద్రకాంత్ మెహతా

సాహిత్యం, విద్య

గుజరాత్

56

డాక్టర్ రట్టన్ లాల్ మిట్టల్

వైద్యం

పంజాబ్

57

మాధవన్ నంబియార్

క్రీడ‌లు

కేరళ

58

శ్యామ్ సుందర్ పాలివాల్

సామాజిక సేవ

రాజస్థాన్

59

డాక్టర్ చంద్రకాంత్ సంభాజీ పాండవ్

వైద్యం

ఢిల్లీ

60

డాక్టర్ జె ఎన్ పాండే(మరణానంతరం)

వైద్యం

ఢిల్లీ

61

సోలమన్ పప్పయ్య సాహిత్యం,

విద్య- జర్నలిజం

తమిళనాడు

62

పప్పమ్మల్

ఇతరులు- వ్యవసాయం

తమిళనాడు

63

డాక్టర్ కృష్ణ మోహన్

పాతి వైద్యం

ఒడిశా

64

జస్వంతిబెన్ జామ్నాదాస్ పోపాట్ వాణిజ్యం,

పరిశ్రమలు

మహారాష్ట్ర

65

గిరీష్ ప్రభుణ్

సామాజిక సేవ

మహారాష్ట్ర

66

నందా ప్రస్టీ

సాహిత్యం, విద్య

ఒడిశా

67

కె కె రామచంద్ర పులవర్

కళలు

కేరళ

68

బాలన్ పుతేరి

సాహిత్యం, విద్య

కేరళ

69

బీరుబాలా రభా

సామాజిక సేవ

అస్సాం

70

కనక రాజు

కళలు

తెలంగాణ

71

బొంబాయి జయశ్రీ రామ్‌నాథ్

కళలు

తమిళనాడు

72

సత్యారామ్ రీయాంగ్

కళలు

త్రిపుర‌

73

డాక్టర్ ధనంజయ్ దివాకర్ సాగ్డియో

వైద్యం

కేరళ

74

అశోక్ కుమార్ సాహు

వైద్యం

ఉత్తర ప్రదేశ్

75

డాక్టర్ భూపేంద్ర కుమార్ సింగ్ సంజయ్

వైద్యం

ఉత్తరాఖండ్

76

సింధుటై సప్కల్

సామాజిక సేవ

మహారాష్ట్ర

77

చమన్ లాల్ సప్రూ(మరణానంతరం)

సాహిత్యం, విద్య

జమ్మూ, కశ్మీర్

78

రోమన్ శర్మ

సాహిత్యం,విద్య- జర్నలిజం

అస్సాం

79

ఇమ్రాన్ షా

సాహిత్యం, విద్య

అస్సాం

80

ప్రేమ్‌ చంద్ శర్మ

ఇతరులు- వ్యవసాయం

ఉత్తరాఖండ్

81

అర్జున్ సింగ్ షేఖావత్

సాహిత్యం, విద్య

రాజస్థాన్

82

రామ్ యత్న శుక్లా

సాహిత్యం, విద్య

ఉత్తర ప్రదేశ్

83

జితేందర్ సింగ్ షంటీ

సామాజిక సేవ

ఢిల్లీ

84

కర్తార్ పరాస్ రామ్ సింగ్

కళలు

హిమాచల్ ప్రదేశ్

85

కర్తార్ సింగ్

కళలు

పంజాబ్

86

డాక్టర్ దిలీప్ కుమార్ సింగ్

వైద్యం

బీహార్

87

చంద్ర శేఖర్ సింగ్

ఇతరులు-వ్యవసాయం

ఉత్తర ప్రదేశ్

88

సుధా హరి నారాయణ్ సింగ్

క్రీడలు

ఉత్తర ప్రదేశ్

89

వీరేందర్ సింగ్

క్రీడ‌లు

హరియాణ

90

మృదుల సిన్హా(మరణానంతరం)

సాహిత్యం, విద్య

బిహార్

91

కె సి శివశంకర్(మరణానంతరం)

కళలు

తమిళనాడు

92

గురు మా కమలి సోరెన్

సామాజిక సేవ

పశ్చిమ బెంగాల్

93

మరాచీ సుబ్బూరామన్

సామాజిక సేవ

తమిళనాడు

94

పి సుబ్రమణియన్(మరణానంతరం)

వాణిజ్యం, పరిశ్రమలు

తమిళనాడు

95

నిడుమోలు సుమతి

కళలు

ఆంధ్రప్రదేశ్

96

కపిల్ తివారీ

సాహిత్యం, విద్య

మధ్యప్రదేశ్

97

ఫాదర్ వల్లస్(మరణానంతరం)

సాహిత్యం, విద్య

స్పెయిన్

98

డాక్టర్ తిరువెంగడం వీరరాఘవన్(మరణానంతరం)

వైద్యం

తమిళనాడు

99

శ్రీ‌ధర్ వెంబు

వాణిజ్యం, పరిశ్రమలు

తమిళనాడు

100

కె వై వెంకటేష్

క్రీడ‌లు

కర్ణాటక

101

ఉషా యాదవ్

సాహిత్యం, విద్య

ఉత్తర ప్రదేశ్

102

కల్ క్వాజీ సజ్జాద్ అలీ జహీర్

ప్రజా వ్యవహారాలు

బంగ్లాదేశ్


ఇంజనీరింగ్ విద్యార్థిని సంధ్యాశ్రీ రికార్డు
కేజీ నల్ల నువ్వుల్లో ఎన్ని గింజలు ఉంటాయో లెక్కపెట్టిన ఇంజనీరింగ్ విద్యార్థిని హెచ్‌కే సంధ్యాశ్రీ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. కేజీలో 3,78,615 నువ్వులు ఉన్నట్టు ఆమె లెక్కించింది. కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా హొసూరుదొడ్డి గ్రామానికి చెందిన సంధ్యాశ్రీ... బెంగళూరు సమీపంలోని బిడదిలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది.

షి’పాహి సమావేశం...
హైదరబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జనవరి 27న ‘షి’పాహి (సిపాయి నుంచి స్ఫూర్తిగా తీసుకున్నది) మొదటి వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, ఒక షీ షటిల్ బస్‌ను అదనపు డీజీపీ స్వాతిలక్రా, సైబరాబాద్ సీపీ సజ్జనార్, ప్రముఖ సినీ అనుష్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ ‘డయల్ 100’వాహనాల ను తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా డ్రైవర్లు నడపనున్నారు.

జాతీయ ఇంధన పొదుపు అవార్డులను ప్రకటించే సంస్థ?
Current Affairs
కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డులు-2020లలో 13 అవార్డులను భారతీయ రైల్వే కై వసం చేసుకుంది. జనవరి 11న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా) ఆర్‌కే సింగ్ ఈ అవార్డులను రైల్వే అధికారులకు అందజేశారు.
అవార్డుల్లో... పశ్చిమ రైల్వే ప్రథమ బహుమతి, తూర్పు రైల్వేకు ద్వితీయ బహుమతి, ఈశాన్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్లకు రవాణా కేటగిరీలో మెరిట్ సర్టిఫికెట్ దక్కాయి. రైల్వే వర్క్ షాప్ సబ్ కేటగిరీలో విజయవాడ డీజిల్ లోకోషెడ్ ప్రథమ బహమతి సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఇంధన పొదుపు అవార్డులు-2020 ప్రధానం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ)
ఎందుకు : ఇంధన పొదుపు విషయంలో విశేష కృషి చేసినందుకు

భారత మహిళా పైలట్ల రికార్డు
పూర్తిగా మహిళా పైలట్లతోనే ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి భారత మహిళా పైలట్లు సరికొత్త చరిత్ర లిఖించారు. ఎయిర్ ఇండియాకి చెందిన ‘‘బోయింగ్ 777’’ విమానాన్ని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌లోని బెంగళూరు వరకు విజయవంతంగా నడిపారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన విమానం సుదీర్ఘ ప్రయాణం దాదాపు 16 గంటల తర్వాత జనవరి 11న బెంగళూరుకు చేరుకుంది. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరే, కెప్టెన్ శివానీ మన్హాస్ అనే నలుగురు పైలట్లు ఈ విమానాన్ని నడిపించారు.
విశేషాలు...
  • అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం గుండా ఎక్కడా ఆగకుండా(నాన్‌స్టాప్) ప్రయాణించి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ఈ విమానం ల్యాండయింది.
  • ఈ మార్గంలో ప్రయాణం ద్వారా 10 టన్నుల ఇంధనాన్ని పైలట్లు ఆదా చేశారు.
  • మొత్తం 13,993 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 16 గంటల్లో అధిగమించింది.
  • ఈ ఎయిర్‌ఇండియా (ఏఐ 176) విమానానికి జోయాఅగర్వాల్ ప్రధాన పైలట్‌గా వ్యవహరించారు.


నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2020విజేత?
ఎయిర్ కండీషనర్ల తయారీ అగ్రగామి వోల్టాస్ కంపెనీ... ఇంధన మంత్రిత్వ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు- 2020’ను గెలుచుకుంది. పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఆటంకం కలుగకుండా ఇంధన వినియోగాన్ని తగ్గించే సంస్థలను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును అందజేస్తుంది. వరుసగా నాలుగోసారి అవార్డును దక్కించుకోవడం గర్వంగా ఉందని కంపెనీ సీఈవో డెరైక్టర్ ప్రదీప్ బక్షి తెలిపారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ బాధ్యతను ఈ అవార్డు మరింత పెంచిందని బక్షి వివరించారు.

Published date : 02 Mar 2021 03:25PM

Photo Stories