Infosys Prize 2023: హైదరాబాద్ మహిళకు ‘ఇన్ఫోసిస్ అవార్డ్’.. భారీ ప్రైజ్ మనీ.. ఎంతంటే..?
బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ అవార్డుల ప్రదానోత్సవంలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ వంటి పలు రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి అవార్డులు అందించడం జరిగింది. ఇన్ఫోసిస్ అవార్డు 2023లో గోల్డ్ మెడల్, 100000 డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,97,855) ప్రైజ్ మనీ ఉంటాయి.
హైదరాబాద్ మహిళ కరుణ మంతెన మాత్రమే కాకుండా.. ఈ అవార్డు గ్రహీతల్లో ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్లు సచ్చిదా నంద్ త్రిపాఠి, అరుణ్ కుమార్ శుక్లా, సైన్స్ గ్యాలరీ బెంగళూరు డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీ, అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెర్న్‌హోల్జ్ జాయింట్ ప్రొఫెసర్ భార్గవ్ భట్ మొదలైనవారు ఉన్నారు.
#InfosysPrize2023 in Social Sciences is awarded to @KMantena, @Columbia, for her research on the theory of imperial rule, and the claim that this late imperial ideology became one of the important factors in the emergence of modern social theory. pic.twitter.com/fKYBXhr2eC
— Infosys Prize (@InfosysPrize) November 15, 2023