Tamilisai Soundararajan: రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డును గెలుచుకున్న సంస్థ?
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డును గెలుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జనవరి 3న హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జీఎంఆర్ ప్రతినిధులకు అవార్డును అందజేశారు. ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ముందు వరుసలో ఉందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
ప్రముఖ ఆధునిక కవి అరుణ్‌సాగర్ జయంతి సందర్భంగా అరుణ్‌సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 2న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాలు’ ప్రదానం చేశారు. ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తికి విశిష్ట సాహిత్య పురస్కారం, సీనియర్ సంపాదకుడు ఎమ్.నాగేశ్వరరావుకు విశిష్ట పాత్రికేయ పురస్కారం అందించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సమాచార హక్కు కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రముఖ కవి, సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి పాల్గొన్నారు.
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. జనవరి 3న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో పోలవరం సవరించిన అంచనా వ్యయాలను తక్షణమే ఆమోదించేలా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలో రెవెన్యూ లోటు, పెండింగ్ నిధులు, విద్యుత్ బకాయిలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం సవరించిన అంచనా వ్యయాలు తదితర అంశాలపై అంశాలపై ప్రధానితో చర్చించి వినతి పత్రాలను అందచేశారు.
చదవండి: నైట్‌హుడ్ హోదా పొందిన మాజీ ప్రధాన మంత్రి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డు ప్రదానం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్