World Endoscopy Organization: డబ్ల్యూఈవో లైఫ్ టైం అవార్డుకు ఎంపికైన భారతీయుడు?
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డికి అరుదైన పురస్కారం దక్కింది. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఈవో) ప్రతిష్ఠాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని (లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు) ప్రకటించింది. దీంతో ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుగా నాగేశ్వరరెడ్డి నిలిచారు. 2022 మేలో జపాన్‌లోని టోక్యోలో జరిగే ప్రపంచ ఎండోస్కోపీ కాంగ్రెస్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత
అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మహ్మద్ ఫరీదుద్దిన్ (64) డిసెంబర్ 29న గుండెపోటుతో మృతి చెందారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఫరీదుద్దీన్ 1957 అక్టోబర్ 14న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతి (బి) గ్రామంలో జన్మించారు. ఉమ్మడి రా ష్ట్రంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆయన 2004 నుంచి 2009 వరకు మంత్రిగా కొనసాగారు. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. 2016లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.
చదవండి: కువెంపు జాతీయ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఈవో) లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికైన భారతీయుడు?
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి
ఎందుకు : గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించి చేసిన పరిశోధనలకుగాను..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్