Nobel Prize: వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు–2021
మానవ నాడి కొసళ్లలో ఉండే అతిసూక్ష్మమైన సెన్సర్లు వేడిని... శరీరంలోని ప్రత్యేకమైన సెన్సర్లు ఒత్తిడిని గుర్తిస్తాయని ప్రపంచానికి తెలిపిన అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటేయిన్‌లకు 2021 ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు లభించింది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉన్న కారోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో అక్టోబర్ 4న నోబెల్ అవార్డు కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. వేడి, ఒత్తిడిలను శరీరం ఎలా పసిగడుతోందో తెలుసుకోవడం వల్ల వైద్యశాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయని పేర్కొంది. త్వరలో ఒక ప్రత్యేక ఉత్సవంలో వీరిద్దరికి సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నోబెల్ పురస్కారంలో భాగంగా బంగారు పతకంతో పాటు 11 లక్షల డాలర్ల నగదును డేవిడ్, ఆర్డెమ్‌లకు అందజేస్తారు. వీరిద్దరూ విడివిడిగా జరిపిన పరిశోధనల్లో ఇంద్రియానుభూతులను శరీరం ఎలా గ్రహించగలుతోంది అన్నది ఆవిష్కరించారు.
డేవిడ్ జూలియస్...
న్యూయార్క్‌లో జన్మించిన డేవిడ్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మిరపకాయలోని కాప్‌సేసన్‌ను ఉపయోగించడం ద్వారా మన నాడుల చివర్లలో కొన్ని సెన్సర్ల వంటివి ఉంటాయని, ఇవి వేడి, మంట వంటి అనుభూతులను మెదడుకు చేరవేస్తాయని ఆయన తెలుసుకోగలిగారు. మనిషి శరీరంలో కాప్సాయిసిన్ అనే పదార్థానికి స్పందించే ప్రత్యేక రకం(టీఆర్‌పీవీ1) జన్యు కణం ఉన్నట్లు కనుగొన్నారు. మంటకు, నొప్పికి కారణమైన ఉష్ణోగ్రతకు కూడా ఇది స్పందిస్తుందని వెల్లడైంది.
ఆర్డెమ్ పటాపౌటేయిన్...
లెబనాన్‌లోని బీరూట్‌లో జన్మించిన ఆర్డెమ్ ప్రస్తుతం కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఒత్తిడిని గుర్తించే ప్రత్యేక కణాలను వాడి చర్మం, శరీరం లోపలి భాగాల్లోని ప్రత్యేక సెన్సర్లు యాంత్రిక ప్రేరణను ఎలా గుర్తిస్తాయో ఆయన తెలుసుకున్నారు. చలి లేదా చల్లదనానికి స్పందించే గ్రాహక కణ పదార్థం(టీఆర్‌పీఎం8)ను కనుగొన్నారు.
చదవండి: వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు-2020
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటేయిన్
ఎందుకు : మానవ నాడి కొసళ్లలో ఉండే అతిసూక్ష్మమైన సెన్సర్లు వేడిని... శరీరంలోని ప్రత్యేకమైన సెన్సర్లు ఒత్తిడిని గుర్తిస్తాయని ప్రపంచానికి తెలిపినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్