Central Sahitya Akademi: పత్తిపాక మోహన్‌కు బాలసాహిత్య పురస్కారం ప్రదానం
నవంబర్ 14 న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ రాసిన ‘బాలల తాత బాపూజీ’గేయ కథకుగాను ఈ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబార్, అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావులు అందించారు.
Also read: Thapi Dharmarao award 2022: ప్రముఖ కార్టూనిస్టు సరసికి బహూకరణ
2022 గాను మొత్తం 22 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారాలు అందించింది. డాక్టర్ సి. నారాయణరెడ్డి శిష్యుల్లో ఒకరైన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు. కవి, సాహిత్య విమర్శకులు అయిన మోహన్.. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులుగా బాలల్లో సాహిత్యంపై మక్కువ పెంచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువాదం చేశారు. పాశ్చాత్య సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్న యువతరంతో పాటు, మత విద్వేషాలు పెరుగుతున్న సమాజానికి మహాత్మా గాంధీ చూపిన బాట అవసరమని పత్తిపాక మోహన్ అభిప్రాయపడ్డారు. అంతేగాక ఈ తరం పిల్లలకు గాంధీ గురించి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మాగాంధీపై తాను రాసిన పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP