Skip to main content

Dr.Pavuluri Subba Rao: అంతరిక్ష శాస్త్రవేత్త సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు

తెనాలి: తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ/చైర్మన్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు.
Dr.Pavuluri Subba Rao Wins Prestigious Award for Lifetime
డాక్టర్‌ సుబ్బారావుకు అవార్డు ప్రదానం చేస్తున్న ఇస్రో చైర్మన్‌ సోమనాథ్

భారతదేశంలో ఆస్త్రోనాటిక్స్‌ ప్రమోషన్స్‌కు డాక్టర్‌ సుబ్బారావు చేసిన జీవితకాల అద్భుత సహకారానికి గుర్తింపుగా ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ),‘ఆర్యభట్ట’ అవార్డు, ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలో’ బిరుదును ప్రదానం చేసింది. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 17వ తేదీ ఏర్పాటైన ప్రత్యేక సభలో ఏఎస్‌ఐ అధ్యక్షుడు, ఇస్త్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌, ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ చేతులమీదుగా స్వీకరించారు. 

డాక్టర్‌ సుబ్బారావు తొలుత ఇస్రోలో శాస్త్రవేత్తగా చేశారు. అత్యంత అధునాతన ఏవియానిక్స్‌ను స్వదేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేయాలనే భావనతో 1992లో అనంత్‌ టెక్నాలజీస్‌ను స్థాపించారు. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, తిరువనంతపురంలో గల అనంత్‌ టెక్నాలజీస్‌ సంస్థల్లో 1600 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇప్పటివరకు 98 ఉపగ్రహాలు, 78 లాంచ్‌ వెహికల్స్‌కు డాక్టర్‌ సుబ్బారావు నేతృత్వంలోని అనంత్‌ సంస్థ సహకరించింది.

Rakesh Sharma: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఈయ‌నే.. ఈ యాత్రకు 40 ఏళ్లు!!

Published date : 18 Apr 2024 06:20PM

Photo Stories