UN World Tourism Awards: వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా ఎంపికైన గ్రామం?
ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ) అందించే ‘‘వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్’’ అవార్డుకు.. భారత్ నుంచి ఎంపికైన భూదాన్‌పోచంపల్లికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అవార్డును ప్రదానం చేశారు. డిసెంబర్ 2న జరిగిన యూఎన్‌డబ్ల్యూటీఓ 24వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తరఫున స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయ రెండవ కార్యదర్శి సుమన్‌శేఖర్ ఈ అవార్డును స్వీకరించారు. యూఎన్‌డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఉంది.
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో భూదాన్‌పోచంపల్లి గ్రామం ఎంపికైన విషయం తెలిసిందే. రూరల్ టూరిజం, అక్కడి ప్రజల జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలను వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రతి ఏటా యూఎన్‌డబ్ల్యూటీఓ బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున పోచంపల్లి ఈ అవార్డుకు ఎంపికైంది.
చదవండి: ఇటీవల వీర్ చక్ర పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూదాన్‌పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ)
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్
ఎందుకు : ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్