Skip to main content

CUET PG Exams 2024 : సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం, మార్చి 28 వరకు పరీక్షలు

CUET PG 2024 Exam Schedule   Students Preparing for CUET Exam  CUET PG Exams 2024    CUET PG 2024 Entrance Exam   National Testing Agency
CUET PG Exams 2024

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2024 ప్రవేశ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 28వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది.దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 4,62,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీయూఈటీ- 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తాయి.

వీటిల్లో సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. 
 

Published date : 13 Mar 2024 03:25PM

Photo Stories