CUET: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు
ఈ మేరకు డిసెంబర్ 22న వెబ్‌నోట్ విడుదల చేసింది. సీయూఈటీయూజీ–2023 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుందని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రంజన్ జైన్ పేర్కొన్నారు. పరీక్షలను మే 21, మే 31 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక సీయూఈటీపీజీ–2023 పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
చదవండి: Admissions in Central university: సీయూఈటీకి.. సిద్ధం కావాలి ఇలా
ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూళ్లను ప్రకటించనుంది. ఈ సీయూఈటీ పరీక్షలను తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. జూలై చివరి వారంలో ఆయా వర్సిటీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆగస్టు 1వ తేదీ నుంచి అకడమిక్ సెషన్లు ప్రారంభమవుతాయని వివరించారు.