Skip to main content

Inspirational Story: ఫుడ్‌ సర్వ్‌ చేసేవాడు..ఇప్పుడు అంబానీనే దాటేలా చేసిందిలా...

ఒకప్పుడు మెక్‌డోనాల్డ్స్ ఔట్‌లెట్‌లో కస్టమర్లకు బర్గర్స్‌ను, కూల్‌ డ్రింక్స్‌ సర్వ్‌ చేసేవాడు.
Changpeng Zhao
Changpeng Zhao

కట్‌ చేస్తే..ఇప్పుడెమో ముఖేశ్‌ అంబానీ సంపదనే దాటేసి ప్రపంచ కుబేర్ల జాబితాలో 11 వస్థానాన్ని కైవసం చేసుకున్నాడు  చైనీస్‌ కెనాడియన్‌ చాంగ్‌పెంగ్ జావో.

ఆ ఒక్క దానితో దశ తిరిగింది..!
టెక్ బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ , మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రపంచ కుబేర్ల జాబితాలో చాంగ్‌పెంగ్‌ జావో నిలిచేందుకు ఆ ఒక్కటి ఎంతగానో ఉపయోగపడింది. అదే క్రిప్టోకరెన్సీ..!   ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం బినాన్స్‌ను స్థాపించి ఒక్కసారిగా ప్రపంచ కుబేరులకే సవాలును విసిరాడు జావో. బ్లూమ్‌బర్గ్‌ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం...జావో నికర విలువ 96 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. దీంతో ఇండియన్‌ టైకూన్‌ ముఖేష్‌ అంబానీ స్థానాన్ని కూడా దాటేశాడు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రిప్టో బిలియనీర్ జావో అలియాస్‌ సీజెడ్‌ అవతారమెత్తాడు. 

ప్రపంచంలోనే అతిపెద్ద..!

CEO


జావో సాఫ్ట్‌వేర్‌ డెవలపింగ్‌లో సిద్ధ హస్తుడు. అంతేకాకుండా బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీను వేగంగా అలవర్చుకున్నాడు. 2008లో వచ్చిన క్రిప్టోకరెన్సీ భవిష్యత్తులో వాడే డిజిటల్‌ కరెన్సీగా చెలామణీ అవుతుందనే నమ్మకం అతన్ని ఒమ్ము చేయలేదు. బినాన్స్‌ను 2017లో స్థాపించి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు అద్బుతమైన ప్లాట్‌ఫాంను క్రియేట్‌ చేశాడు ఈ సీజెడ్‌. ఈ ప్లాట్‌ఫాం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంగా నిలుస్తోంది. 

కలిసొచ్చిన..
తొలినాళ్లలో క్రిప్టోకరెన్సీపై ఉన్న ఆదరణ గణనీయంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడే అదే ఆదరణ జావోను ప్రపంచ కుబేర్ల జాబితాలో ఉంచేలా చేసింది. బినాన్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌ల సమీక్ష ప్రకారం... ఒక్క 2021లో 20 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక కంపెనీలో జావో సుమారు 90 శాతం మేర​ షేర్లను కల్గి ఉన్నాడు. 

అంతకుమించే...

Success Story


ఇక జావో బహిరంగంగా తన వ్యక్తిగత క్రిప్టో హోల్డింగ్స్ గురించి ఎక్కడా వ్యాఖ్యానించలేదు. అదే విధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ ఆర్థిక విషయాల గురించి పెద్దగా బహిర్గతం చేయదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్. బినాన్స్‌లో  రోజుకు 170 బిలియన్‌ డాలర్ల  క్రిప్టో ట్రేడ్‌లను ప్రాసెస్ చేస్తుంది. జావో పూర్తి సంపద ఎంతో తెలిస్తే అందరు షాక్‌ అవ్వడం కాయం.

అంతా స్వచ్చంద సంస్ధకే..

Success


జావో తన సంపదలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని ఒక ఇంటర్య్వూలో చెప్పాడు. అంతేకాకుండా.. ‘వ్యక్తిగతంగా, నేను ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాను. నాకు డబ్బు అవసరం అంతగా లేదు.రాక్‌ఫెల్లర్‌ లాగే నా సంపదలో మెజార్టీ  భాగాన్ని స్వచ్చంద సంస్థలకే అంకింతమని అన్నాడు. జావో తన సంపదలో 95 శాతం లేదా 99 శాతం స్వచ్చంద సంస్థలకే ఇవ్వాలనుకుంటున్నాడు.

Published date : 10 Jan 2022 07:18PM

Photo Stories