Skip to main content

యువతకు, అధ్యాపకులకువివిధ టెక్నాలజీ కోర్సులపై ఉచిత ఆన్‌లైన్ శిక్షణ: ఏపీఎస్‌ఎస్‌డీసీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు, అధ్యాపకులకు మార్కెట్‌లో డిమాండ్ కలిగిన వివిధ టెక్నాలజీలపై ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎండీ అర్జా శ్రీకాంత్‌లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇటీవల మైండ్ మాజిక్స్ సంస్థ ఆధ్వర్యంలో సేల్స్ ఫోర్స్ విభాగంలో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ప్రోగ్రామ్ నిర్వహించిందన్నారు. ఇందులో క్లౌడ్ కంప్యూటరింగ్, డాటా మోడల్ అండ్ స్కీమ్ ట్రైనింగ్, మేనేజ్‌మెంట్ కస్టమ్ యాప్, కస్టమర్, అడ్మిన్ పోర్టర్, లైవ్ చాట్ ఏజెంట్ అండ్ ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ డాష్‌బోర్డు లాంటి అంశాలపై యువతకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 1,302 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికెట్ పొందారని వెల్లడించారు. శిక్షణా కార్యక్రమాల సమాచారం www.apssdc.in వెబ్‌సైట్‌లో లేదా 1800425422 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.
Published date : 17 Aug 2020 01:08PM

Photo Stories