Skip to main content

యూనివర్సిటీ ల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సిలబస్‌ను రీడిజైన్ చేయండి: ఏపీ గవర్నర్

సాక్షి, అమరావతి: యూనివర్సిటీల పరీక్షల నిర్వహణలో.. యూజీసీ నిర్దేశించిన కోవిడ్-19 ప్రొటోకాల్‌ను పాటించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వైస్ ఛాన్సలర్లను ఆదేశించారు.

విశ్వవిద్యాలయాల వీసీలతో ఆయన రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గవర్నర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విసిరిన సవాలును సమర్థంగా ఎదుర్కొంటూ ఆన్‌లైన్‌లో తరగతుల నిర్వహణకు వీలుగా (సిలబస్‌ను రీడిజైన్) పాఠ్యాంశాలను పునర్ వ్యవస్థీకరించాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సిలబస్‌ను సకాలంలో సమర్థంగా పూర్తి చేయడంపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక ఈ సదస్సులోని మరిన్ని ముఖ్యాంశాల విషయానికి వస్తే..

  • కరోనా వైరస్ సంక్షోభ సమయంలోనూ మన విద్యా ప్రమాణాలను ఉన్నతంగా నిలిపేలా విద్యావిధానాన్ని కొనసాగిస్తున్నామని సదస్సుకు హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.
  • వీసీలు మాట్లాడుతూ.. చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలోగానీ ఆన్‌లైన్ విధానంలోగానీ నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. యూజీసీ ఆదేశాలమేరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Published date : 18 Jul 2020 11:50AM

Photo Stories