Skip to main content

యూజీసీ నెట్ 2020 ఫలితాలు విడుదల

జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
యూజీసీ నెట్ 2020కి సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. అభ్యర్ధులు ఫలితాలను http://ugcnet.nta.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.యూజీసీ నెట్ 2020 పరీక్షలను సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 13 తేదీల మధ్య నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు. ఈ సంవత్సరం జనరల్ కేటగిరీ 47,161, ఓబీసీ 1,92,434, ఎస్సీ 88,914 ఎస్టీ 33,811, పీడబ్ల్యూడీ 7505 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 1,56,882 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

ఫలితాల కోసం..
  1. మొదట యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లింక్ మీద క్లిక్ చేయండి.
  2. హోమ్ పేజ్‌లో UGC NET June 2020 Result లింక్ మీద క్లిక్ చేయండి.
  3. లాగ్ఇన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. యూజీసీ పరీక్ష ఫలితాలు స్రీన్ మీద కనిపిస్తాయి.
  5. ఈ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవాలి.

డైరక్ట్ లింక్ కోసం:
ntaresults.nic.in/resultservices/UGCNet&auth&June&2020
Published date : 02 Dec 2020 05:51PM

Photo Stories