Skip to main content

విద్య, ఉద్యోగాలకే 50% రిజర్వేషన్లు: సుభాష్‌చంద్రబోస్

కొత్తపేట: సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్లు పరిమితం విద్య, ఉద్యోగాలకు మాత్రమేనని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు.
దీన్ని వక్రీకరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన 59.8 శాతం రిజర్వేషన్లపై ఒక పత్రిక రాసిన రెచ్చగొట్టే వార్తపై మంత్రి బోస్ తీవ్రంగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్మించిన బీసీ కన్వెన్షన్ హాలును మంత్రి బోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ సీఎం బోస్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి బోస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బడుగు, బలహీన వర్గాలకు 59.8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే ఒక పత్రిక ప్రజలను రెచ్చగొట్టే విధంగా కథనం రాయడాన్ని ఆయన ఖండించారు. సుప్రీంకోర్టు నిబంధన కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమే తప్ప రాజకీయాలకని ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఆ రాతలను ప్రజలు ఆమోదించరని హితవు పలికారు.
Published date : 03 Jan 2020 03:15PM

Photo Stories