Skip to main content

వెరిఫికేషన్ లేకుండానే పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: పాలిసెట్-2020 కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 30, వచ్చే నెల 1వ తేదీల్లో మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
అయితే రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వకుండానే రెండో దశ ప్రవేశాలు చేపట్టడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పాలిసెట్‌లో 45,207 మంది అర్హత సాధిస్తే.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 27,759 మంది పాల్గొన్నారు. మిగతా వారిలో పలువురు చివరి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని భావించారు. అయితే మొదటి దశలో ఇచ్చినట్లు సాంకేతిక విద్యాశాఖ ఈసారి కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్‌కు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వలేదు. మొదటి దశలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారికి మాత్రమే చివరి దశలో ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించింది. వారికి మాత్రమే 3వ తేదీన సీట్లను కేటాయించనుంది. అయితే చివరి దశ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వకుండా, మొదటి దశ వెరిఫికేషన్‌కు హాజరు కాని వారికి అన్యాయం చేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
Published date : 30 Sep 2020 12:59PM

Photo Stories