టీఎస్ఐసెట్– 2021 గడువు ఆగస్టు 5 వరకు పొడిగింపు
Sakshi Education
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ఐసెట్– 2021 ఆన్లైన్ దరఖాస్తుల గడు వును ఆగస్టు 5 వరకు పొడిగించినట్లు టీఎస్ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
టీఎస్‌ఐసెట్‌కు ఇప్పటివరకు 62,500 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాది కంటే 4,500 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి icet. tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. 19, 20 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
టీఎస్‌ఐసెట్– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గైడెన్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
టీఎస్ఐసెట్– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గైడెన్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 02 Aug 2021 03:12PM