Skip to main content

టీఎస్ పంచాయతీరాజ్‌లో పదోన్నతుల మేళా

సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల మేళా జరుగుతోంది.
వివిధ కేటగిరీల అధికారులు, ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించిన ఆ శాఖ.. తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, డీపీవో, డీఎల్‌పీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (గ్రేడ్-1,2), గ్రామాభివృద్ధి అధికారుల (వీడీవో)కు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సీనియారిటీ జాబి తాలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన ప్రత్యేక మదింపు నివేదిక (ఎస్‌ఏఆర్)ను పంపాలని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్.. జిల్లా పరిషత్ సీఈవో, డీపీవోలను ఆదేశించారు. జోన్-5లో 94 మంది, జోన్-6లో 25 మంది సీనియారిటీ జాబితాలో ఉన్నారు.
Published date : 19 Feb 2020 03:15PM

Photo Stories