Skip to main content

టీఎస్ పాలిసెట్-2020 దరఖాస్తు గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలిసెట్-2020 దరఖాస్తుల గడువును మే 9 వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి యూవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 9 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే లేటరల్ పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎల్‌పీ సెట్) దరఖాస్తుల గడువును మే 11 వరకు పొడిగించినట్లు మూర్తి వెల్లడించారు.
Published date : 30 Apr 2020 02:10PM

Photo Stories