టీఎస్ ఈసెట్ 2020 ప్రాథమిక కీ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) గత నెల 31న నిర్వహించిన ఈసెట్ ప్రాథమిక కీని విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మంజూ ర్ హుస్సేన్ తెలిపారు.
నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో కీని రూపొందించి తమ వెబ్‌సైట్‌లో (ecet.tsche.ac.in) అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తమ అభ్యంతరాలను వెబ్‌సైట్‌లో పేర్కొన్న లింక్ ద్వారా పంపించాలని సూచించారు.
Published date : 05 Sep 2020 01:01PM