టీఎస్ గురుకులాల్లో ఐదో తరగతి– 2021 ప్రవేశాలకు నోటిఫికేషన్.. మే 30న..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి వీటీజీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో ఉన్న మొత్తం 46,937 సీట్లకు, మే 30న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ గురుకులాల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎంపిక చేసుకున్న సొసైటీల వారీగా ఫలితాలను విశ్లేషించి అర్హులను ఖరారు చేస్తారు. ఆన్‌లైన్ లో ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2020–21 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్షకు అర్హులు. వివరాలకు 180042545678 టోల్‌ఫ్రీ నంబర్ లేదా గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌ను చూడాలని వీటీజీసెట్ కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సొసైటీల పరిధిలో ఐదో తరగతిలో సీట్లు..
సొసైటీల పరిధిలో ఐదో తరగతిలో సీట్లు..
సొసైటీ | సీట్లు |
సాంఘిక | 18,560 |
గిరిజన | 4,777 |
బీసీ | 20,800 |
జనరల్ | 2,800 |
Published date : 11 Mar 2021 03:50PM