Skip to main content

టీఎస్ ఎడ్‌సెట్-2020 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ ఎప్పుడంటే..

ఉస్మానియా యూనివర్సిటీ: బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్‌సెట్ కార్యాలయంలో అక్టోబర్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని ఫలితాలను విడుదల చేశారు. అక్టోబర్ 1, 3వ తేదీల్లో నిర్వహించిన ఎడ్‌సెట్‌కు 30,600 మంది పరీక్ష రాయగా 29,861 (97.58%) మంది అర్హత సాధించారు. గణితంలో 7,591 మంది, ఫిజికల్ సైన్స్ లో 2,182 మంది, జీవశాస్త్రంలో 9,425 మంది, సాంఘిక శాస్త్రంలో 9,925 మంది, ఆంగ్లంలో 478 మంది, ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో 260 మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.అక్టోబర్ 28 నుంచి ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో 20 వేల సీట్లు ఉన్నట్లు తెలిపారు. డిగ్రీ ఫలితాలు విడుదలవగానే కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎడ్‌సెట్ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ ప్రసాద్, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

టీఎస్ ఎడ్‌సెట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 29 Oct 2020 04:28PM

Photo Stories