టీఎస్ ఎడ్‌సెట్- 2020 చివరి దశ కౌన్సెలింగ్‌లో 6,534 మందికి సీట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో 6,534 మందికి సీట్లు లభించాయి.
ఈ మేరకు ఎడ్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్‌బాబు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 7,815 సీట్లు అందుబాటులో ఉండగా, 12,632 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని, అందులో 6,534 మందికి సీట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. విద్యా ర్థులు వెబ్‌సైట్ నుంచి జాయినింగ్ లెటర్, ట్యూషన్ ఫీజు చలానాను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిం చారు. నిర్ణీత ఫీజు వర్తించే వారు యూనియన్ బ్యాంకు లేదా ఆంధ్రా బ్యాంకులో ఫీజు చెల్లించాల న్నారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీలోగా కాలేజీ ల్లో రిపోర్టు చేయాలని చెప్పారు. అక్కడే ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.
Published date : 18 Feb 2021 04:37PM