టీఎస్ ఐసెట్– 2021 హాల్‌టికెట్లు విడుదల
Sakshi Education
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఐసెట్–21కు ఇప్పటివరకు 66,760 దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి శనివారం వెల్లడించారు.
గత ఏడాదికంటే 8 వేలకుపైగా ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తొలుత ఈ నెల 13 నుంచే హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆదివారం నుంచి వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 19న ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్‌లలో, 20న ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓ సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఏపీ కలిపి 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 75 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాజిరెడ్డి వివరించారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్– 2021 దరఖాస్తు గడువు ఆగస్టు 18 వరకు పొడిగింపు
చదవండి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లు– 2021 ప్రారంభం.. దరఖాస్తు విధానం ఇలానే..
చదవండి: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్– 2021 దరఖాస్తు గడువు ఆగస్టు 18 వరకు పొడిగింపు
చదవండి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లు– 2021 ప్రారంభం.. దరఖాస్తు విధానం ఇలానే..
Published date : 16 Aug 2021 03:23PM