Skip to main content

టీఎస్ ఐసెట్- 2020 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు నేడే ఆఖరు

సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి డిసెంబర్ 12వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్, 13వ తేదీన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ విషయాన్ని టీఎస్ ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్‌మిట్టల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 11,945 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారని వివరించారు. 17,838 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారని వెల్లడించారు. వెంటనే విద్యార్థులు చేరాలనుకున్న కళాశాల, కోర్సులకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.
Published date : 12 Dec 2020 03:32PM

Photo Stories