Skip to main content

టీఎస్ ఐసెట్- 2020 ఫలితాలు

కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలను సోమవారం వెల్లడించనున్నట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి తెలిపారు.
ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న నిర్వహించిన టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 45,975 మంది హాజరయ్యారని తెలిపారు.

Check TS ICET 2020 Results here
Published date : 02 Nov 2020 04:54PM

Photo Stories