టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ క్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పలు కార్యక్రమాలను వాయిదా వేసింది. ప్రజలు ప్రయాణాలు, సందర్శనలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి నిర్వహించతలపెట్టిన టీఆర్‌టీ భాషా పండిత పోస్టులకు సంబంధించి ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను నిలిపివేసింది.
Published date : 20 Mar 2020 03:24PM