Skip to main content

తెలంగాణ సెట్ కన్వీనర్లు ఖరారు: ఉన్నత విద్యామండలి

సాక్షి, హైదరాబాద్: 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్ (కామన్ ఎంట్రన్‌‌స టెస్ట్టు)ల కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 2020-21 విద్యా సంవత్సరం సెట్‌లు నిర్వహించే వర్సిటీలను ఇదివరకే ఖరారు చేసిన టీఎస్‌సీహెచ్‌ఈ.. కన్వీనర్ల నియామకాలకు ఆయా వర్సిటీల నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతో ముగ్గురు చొప్పున పేర్లను టీఎస్‌సీహెచ్‌ఈకి ఇచ్చిన నేపథ్యంలో సీనియార్టీ ఆధారంగా ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ఎంపిక చేసింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్ నియమితులయ్యారు.

సెట్

కన్వీనర్

టీఎస్ ఎంసెట్

ఎ.గోవర్ధన్, జేఎన్‌టీయూహెచ్

టీఎస్ ఈసెట్

ఎం.మంజూర్ హుస్సేన్, జేఎన్‌టీయూహెచ్

టీఎస్ పీఈసెట్

వి.సత్యనారాయణ, ఓయూ

టీఎస్ ఐసెట్

కె.రాజిరెడ్డి, కేయూ

టీఎస్ లాసెట్

జీబీ రెడ్డి, ఓయూ

టీఎస్ పీజీఎల్‌సెట్

జీబీ రెడ్డి, ఓయూ

టీఎస్ పీజీఈసెట్

ఎం.కుమార్, ఓయూ

టీఎస్ ఎడ్‌సెట్

టి.మృణాళిని, ఓయూ

Published date : 21 Jan 2020 02:35PM

Photo Stories