తెలంగాణ నీట్–2020 ర్యాంకులు విడుదల..టాపర్స్ వీరే
రెండు వారాల కింద జాతీయస్థాయిలో నీట్ ర్యాంకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన తుమ్మల స్నికిత రాష్ట్రంలో మొదటి స్థానం లో నిలిచింది. రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి 10 స్థానాల్లో ముగ్గురు బాలికలు ఉండగా, మొదటి 50 స్థానాల్లో 29 మంది బాలురు ఉన్నారు. బాలికలు మాత్రం 21 మంది ఉన్నారు.
నవంబర్ 1న నోటిఫికేషన్..:
సాధారణంగా రాష్ట్ర స్థాయి ప్రాథమిక ర్యాంకులు వెల్లడించిన అనంతరం దరఖాస్తులు ఆహ్వానించి, అందులో నుంచి తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఈసారి ఇప్పటికే నీట్ నిర్వహణలో జాప్యం వల్ల వేగంగా ప్రవేశాలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ర్యాంకులతో పాటు ప్రవేశ ప్రకటన కూడా ఒకేసారి వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. అక్టోబర్ 1న ఆన్‌లైన్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ ప్రవేశాలకు ప్రకటన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈసారి ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టే అవకాశముంది. ఒకవేళ నేరుగా సర్టిఫికెట్లు పరిశీలించాల్సి వస్తే పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉండటంతో అక్టోబర్ 20న తొలి విడత మెడికల్ సీట్లు కేటాయించనున్నారు.
తెలంగాణలో నీట్ అర్హత సాధించిన వారిలో టాప్ 25 మంది వీరే..
పేరు | నీట్ ర్యాంకు | నీట్ స్కోర్ | కేటగిరీ |
తుమ్మల స్నిఖిత | 3 | 715 | అన్ రిజర్వుడ్ |
అనంత పరాక్రమ బి నూకల | 11 | 710 | ఎస్సీ |
బారెడ్డి సాయి త్రిశారెడ్డి | 14 | 710 | అన్ రిజర్వుడ్ |
శ్రీరామ్ సాయి శాతవర్ధన్ | 27 | 705 | ఓబీసీ (ఎన్‌సీఎల్) |
ఆర్యాశ్ అగర్వాల్ | 30 | 705 | అన్‌రిజర్వుడ్ |
మల్లీడి రుషిత్ | 33 | 705 | అన్‌రిజర్వుడ్ |
ఆవుల శుభాంగ్ | 38 | 705 | అన్‌రిజర్వుడ్ |
నిత్య డినేశ్ లుల్లా | 58 | 702 | అన్‌రిజర్వుడ్ |
దుర్గం యశ్వంత్ | 59 | 701 | ఓబీసీ (ఎన్‌సీఎల్) |
మందా లోకేష్‌రెడ్డి | 70 | 700 | అన్ రిజర్వుడ్ |
బైనేని నిషాంత్ చౌదరి | 76 | 700 | అన్ రిజర్వుడ్ |
ఎండీ సాదికుద్దీన్ ఫరూఖీ | 106 | 700 | ఓబీసీ (ఎన్‌సీఎల్) |
గంగవరపు జాహ్నవి | 134 | 695 | అన్ రిజర్వుడ్ |
ఆరెపల్లె మేఘ శివతేజశ్రీ | 136 | 695 | అన్ రిజర్వుడ్ |
ముత్యాల సాయివరుణ్ | 151 | 695 | అన్ రిజర్వుడ్ |
ఆకుల భావన శ్రీనిధి | 152 | 695 | అన్ రిజర్వుడ్ |
సాయిరాజ్ క్యాతమ్ | 153 | 695 | ఓబీసీ (ఎన్‌సీఎల్) |
టి.మనోజ్‌రెడ్డి | 159 | 695 | అన్ రిజర్వుడ్ |
జహీద్ సయీద్ ఇక్బాల్ | 167 | 695 | అన్ రిజర్వుడ్ |
సిరిగిరెడ్డి హవీశ్‌రెడ్డి | 178 | 695 | అన్ రిజర్వుడ్ |
అట్ల రోషన్ తేజ | 179 | 695 | ఓబీసీ (ఎన్‌సీఎల్) |
మార్తి జశ్వంత్‌రెడ్డి | 185 | 695 | అన్ రిజర్వుడ్ |
పసుపులేటి మీనాక్షి | 196 | 693 | ఓబీసీ (ఎన్‌సీఎల్) |
సాంబ్రం సాయిఆదిత్యరెడ్డి | 219 | 691 | అన్ రిజర్వుడ్ |
అదీనా తస్నీమ్ | 230 | 691 | అన్ రిజర్వుడ్ |