Singareni Recruitment: సింగరేణిలో స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి రేపే రాతపరీక్ష
Sakshi Education
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో 84 జూనియర్ స్టాఫ్‌నర్సు డీ కేటగిరీ పోస్టుల భర్తీకి ఈనెల 29న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, పాల్వంచల్లో 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రాతపరీక్ష జరుగుతుందని, గంట ముందునుంచే లోపలికి అనుమతించనుండగా, నిర్ణీత సమయానికి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నియామక విభాగం జీఎం అందెల ఆనందరావు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
Published date : 28 Aug 2021 03:46PM