సుప్రీం తీర్పుకు లోబడే ఫైనల్ పరీక్షలు: సబితారెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల పరీక్షలను సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చేనెల 1 నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్/డిజిటల్ పాఠాలు బోధించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను దోస్త్ ద్వారా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశామని చెప్పారు.
Published date : 26 Aug 2020 01:28PM