స్కూళ్లలో 19,362 పోస్టులు ఖాళీ.. ముందుగా టీచర్ల హేతుబద్ధీకరణ..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ లెక్కలు తేల్చింది.
19,362 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. వాటికి అదనంగా విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో 2,313 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. మొత్తంగా రాష్ట్రంలో 21,675 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వాటన్నింటిని ప్రస్తుతం భర్తీ చేసే పరిస్థితి లేదు. అందులో పదివేలలోపు పోస్టులనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. పాఠశాలల్లో వాస్తవ అవసరాలను తేల్చాకేభర్తీఅంశంపై దృష్టి సారించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేకున్నా టీచర్లు ఉన్నారు. 20 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో వేల సంఖ్యలో టీచర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని విద్యార్థులు ఉండీ, టీచర్లు తక్కువగా ఉన్న స్కూళ్లకు పంపించే ఆలోచనలు చేస్తోంది.
ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు 1,245..
ప్రస్తుతం రాష్ట్రంలో 26,062 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిల్లో 1,06,453 మంది టీచర్లు పని చేస్తున్నారు. అందులో ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1,245 ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన 2019–20 లెక్కల ప్రకారం ఆయా పాఠశాలల్లో 1,160 మంది టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు లేకపోయినా టీచర్లు ఉన్నారు. ఒకటి నుంచి 10 మంది వరకు విద్యార్థులు ఉన్న మరో 1,465 పాఠశాలల్లో 1,836 మంది టీచర్లు ఉన్నారు. దీని ప్రకారం కొన్ని స్కూళ్లలో ఒక్కరు చొప్పున టీచర్లు ఉంటే.. మరికొన్ని స్కూళ్లలో ఇద్దరు ముగ్గురు టీచర్లు కూడా ఉన్నారు. మొత్తం సున్నా నుంచి 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లు 2,708 ఉంటే వాటిల్లో 2,996 మంది టీచర్లు ఉండటం గమనార్హం. ఇక 11–20 మందిలోపు విద్యార్థులు ఉన్న బడులు 3,604 ఉండగా, వాటిలో 5,779 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు లేని స్కూళ్లలోనూ వేల మంది టీచర్లు ఉండటం వల్ల ఎంతో విలువైన మానవ వనరులు వృథా అవుతున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
సర్దుబాటు చేస్తే.. : టీచర్లను సర్దుబాటు చేయడం ద్వారా కొత్తగా నియమించే టీచర్ల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మంజూరైన వాటిలో 19,362 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అంతమందిని నియమించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. టీచర్ల హేతుబద్ధీకరణ చేపడితే 10 వేల వరకే కొత్తగా టీచర్లను నియమించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సర్దుబాటు తరువాతే వాస్తవ లెక్కలు వస్తాయిని, అప్పుడు నియామకాల ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే భర్తీ చేయాల్సిన పోస్టుల ఖాళీల్లోనూ మార్పులు ఉంటాయని ఓ అధికారి చెప్పారు.
రాష్ట్రంలో కేటగిరీల వారీగా టీచర్ల వివరాలివే..

కేటగిరీ | మంజూరు | పనిచేస్తున్నది | ఖాళీలు |
గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్–1 | 25 | 1 | 24 |
గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్–2 | 4,414 | 2,675 | 1,739 |
ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ | 4,207 | 2,386 | 1,821 |
స్కూల్ అసిస్టెంట్స్ | 44,839 | 38,160 | 6,679 |
స్కూల్ అసిస్టెంట్ |
|
|
|
(ఫిజికల్‌ఎడ్యుకేషన్) | 684 | 512 | 172 |
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) | 2,297 | 2,075 | 222 |
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) | 58,321 | 51,519 | 6,802 |
పండిట్ | 9,863 | 8,843 | 1,020 |
మ్యూజిక్/డ్యాన్స్/ఆర్ట్/క్రాఫ్ట్/డ్రాయింగ్/ఇతర | 1,165 | 282 | 883 |
మొత్తం | 1,25,815 | 1,06,453 | 19,362 |
Published date : 25 Jun 2021 04:02PM