Skip to main content

సివిల్స్ పరీక్షల వాయిదాపై వైఖరేంటి?: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, వరదల నేపథ్యంలో సివిల్ సర్వీసెస్-2020 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 28వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది.
ఈ పరీక్షలను రెండు మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ వాసిరెడ్డి గోవర్దన సాయిప్రకాశ్, మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా తీవ్రత, వరదలు తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే లక్షలాది మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని విన్నవించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కన్వీల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ప్రతివాదులైన కేంద్రం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి న్యాయస్థానం నోటీసులు జారీ చేసిందని, పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించిందని పిటిషనర్ల తరపు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ తొలుత వెల్లడించారు. కానీ, న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదని తెలిసింది. పిటిషనర్లే ఈ పిటిషన్ అడ్వాన్స్ కాపీని ప్రతివాదులకు మెయిల్/ఆన్‌లైన్‌లో పంపించుకోవచ్చని సూచించింది.
Published date : 25 Sep 2020 02:52PM

Photo Stories