సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు టీఎస్ ఎంసెట్.. సెట్‌ల తేదీలు విడుదల!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్-20కి సంబంధించి ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భేటీ అయిన అధికారులు ఈ మేరకు తేదీలను నిర్ణయించారు. తాజాగా ఈ తేదీలను ప్రభుత్వం ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డిని సంప్రదించిన అనంతరం ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది.
టీఎస్ ఎంసెట్ 2020 ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, స్టడీ మెటీరియల్, గెడైన్స్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
టీఎస్ ఐసెట్ 2020 ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, స్టడీ మెటీరియల్, గెడైన్స్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి
ఈ మేరకు ఆదివారం టీఎస్‌సీహెచ్‌ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏడు ఎంట్రన్స్ టెస్ట్‌లకు సంబంధించి ఇందులో షెడ్యూల్ ఉంది. ఈ నెల 31న టీఎస్‌ఈసెట్-20 పరీక్ష జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 4లోగా ఈ ప్రవేశ పరీక్షలు పూర్తికానున్నాయి. ఈ ఏడాది ఏడు ప్రవేశ పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రవేశ పరీక్ష | తేదీ | విద్యార్థులు |
టీఎస్‌ఈసెట్ | ఆగస్టు 31 | 28,038 |
టీఎస్ ఎంసెట్ | సెప్టెంబర్ 9,10,11,14 | 1,42,860 |
టీఎస్‌పీజీసెట్ | సెప్టెంబర్ 21,22,23,24 | 21,758 |
టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్) | సెప్టెంబర్ 28, 29 | 78,664 |
టీఎస్ ఐసెట్ | సెప్టెంబర్ 30, అక్టోబర్1 | 55,578 |
టీఎస్ ఎడ్‌సెట్ | అక్టోబర్ 1,3 | 43,680 |
టీఎస్ లాసెట్ | అక్టోబర్ 4 | 30,150 |
Published date : 24 Aug 2020 02:24PM