సచివాలయ పరీక్షల హాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లను శనివారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ (vsws.ap.gov.in/gramasachivalayam.ap.gov.in)లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు రాతపరీక్షలను నిర్వహిస్తారు. తొలి రోజున జరిగే పరీక్ష హాల్‌టికెట్లను ముందుగా, తర్వాత ఒకట్రెండు రోజుల వ్యవధిలో అందరి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.
గామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, టాపర్స్ గెడైన్స్, బిట్‌బ్యాంక్స్... ఇతర తాజా సమాచారం కొరకు క్లిక్ చేయండి.
- గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు కలిపి 19 కేటగిరీల్లో మొత్తం 16,208 పోస్టులకు జనవరి 10న వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
- ఈ ఉద్యోగాలకు 10,56,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 19 కేటగిరీల ఉద్యోగాలకు వారంపాటు రోజుకు రెండేసి చొప్పున 14 రకాల రాతపరీక్షలు నిర్వహిస్తారు.
- మొత్తం 10.56 లక్షల మంది అభ్యర్థుల్లో 6.81 లక్షల మంది తొలిరోజు జరిగే పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారే. 20వ తేదీ ఉదయం జరిగే కేటగిరీ -1 ఉద్యోగాలకు 4,56,997 మంది, సాయంత్రం జరిగే డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2,24,667 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- జిల్లాల వారీగా రాతపరీక్షల నిర్వహణతోపాటు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్టర్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈవో మెంబర్ కన్వీనర్‌గా, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లతోపాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులతో జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీలను ప్రభుత్వం నియమించింది.
- రాష్ట్రవ్యాప్తంగా 77,558 మంది ఇన్విజిలేటర్లకు ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చింది.
- రాతపరీక్షలకు సంబంధించిన ఓఎమ్మార్ షీట్లను ముద్రించి ఆయా జిల్లాలకు తరలించింది.
- {పతి జిల్లాలో ఓఎమ్మార్ షీట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను సీసీ కెమెరాల ద్వారా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
- రాతపరీక్షలు పూర్తయ్యాక జవాబులతో కూడిన ఓఎమ్మార్ షీట్లను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో భద్రపరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
- అభ్యర్థుల రాకపోకలకు తగినన్ని బస్సుల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆర్టీసీకి లేఖ రాశారు.
Published date : 12 Sep 2020 01:37PM