Skip to main content

రూ.కోటి గెలుచుకున్న ఐపీఎస్ అధికారి

ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 12వ సీజన్ కొనసాగుతోంది.
ఈ సీజన్ లో మొదటిసారిగా కోటి రూపాయల నగదును గెలుచుకున్న నజియా నసీమ్ అనే మహిళ రికార్డ్ సృష్టించింది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్న రెండవ కంటెస్టెంట్‌గా నిలిచారు. ఈ విషయాన్ని సోని ఎంటర్‌టైన్ మెంట్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా 7కోట్ల రూపాయల జాక్‌పాక్ ప్రశ్నకు చేరుకోగలిగారు. మరి 7కోట్లు గెలచుకునే ఆ ప్రశ్న ఏమయింటుంది? నజియా సమాధానం చెప్పిందా లేక వెనుతిరిగిందా అన్నది తెలియాలంటే మాత్రం నవంబర్ 17న టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ చూడాలి. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ ప్రసారం చేసింది.
Published date : 13 Nov 2020 04:28PM

Photo Stories