రేపు టీఎస్ ఐసెట్- 2020 సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 15న సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.
ప్రవేశాల కోసం 16,800 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, అందులో 15,067 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీట్ల కేటాయింపు వివరాలను tsicet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.
Published date : 14 Dec 2020 04:02PM