రేపు జరగనున్న ‘నీట్’ పరీక్షకు డ్రెస్ కోడ్: షూస్ కాదు..చెప్పులేసుకోవాలి!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 13న (ఆదివారం) నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డ్రెస్ కోడ్ విధించింది.
ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. వారిని నిబంధనల ప్రకారం.. తనిఖీ చేసి పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. అలాగే తేలికపాటి, హాఫ్ స్లీవ్‌లెస్ దుస్తులను ధరించి రావాలి. లాంగ్ స్లీవ్‌లెస్‌లను, బిగ్ బటన్స్, ఫుల్ స్లీవ్‌స దుస్తులను అనుమతించరు. బూట్లకు బదులు స్లిప్పర్లు, శ్యాండిళ్లు మాత్రమే వేసుకోవాలి. ఇక అడ్మిట్‌కార్డుతో పాటు వ్యాలిడ్ ఫ్రూప్‌ను తీసుకురావాలి.
కంటైన్మెంట్ జోన్లలో కేంద్రాలుండవ్...
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ‘నీట్’పరీక్షా కేంద్రాలు ఉండవని కేంద్రం ప్రకటించింది. నాన్ కంటైన్మెంట్ జోన్లలోని కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది. అలాగే కంటైన్మెంట్ జోన్లలో నివసించే సిబ్బందిని ఎగ్జామినర్లుగా అనుమతించ బోమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిబం ధనలు విధించింది. కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న సిబ్బందిని నేరుగా పరీక్ష కేంద్రాల్లో కాకుండా, ఇతర పనులకు వాడుకునే అవకాశాన్ని ఆయా విద్యా సంస్థలు లేదా ఏజెన్సీలకు కల్పించారు. పేపర్, పెన్ను వాడుతూ రాసే పరీక్ష కావడంతో నీట్ క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లను విద్యార్థులకు పంపిణీ చేయడానికి ముందు ఇన్విజిలేటర్లు తప్పని సరిగా చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రపర్చు కోవాలి. పరీక్షకు ముందు కూడా ఆయా పత్రా లను శానిటైజ్ చేసి ఇన్విజిలేటర్లకు అప్పగి స్తారు. ఆన్సర్ షీట్ల సేకరణ, ప్యాకింగ్... ఇలా ప్రతి దశలోనూ సిబ్బంది తమ చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి.
ఎగ్జామ్ హాల్‌లోగానీ, ఇతర సందర్భాల్లో గానీ పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కిం చేప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉమ్మి లేదా లాలాజలాన్ని వాడరాదు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, బ్యాగులు సహా ఇతరత్రా వ్యక్తిగత వస్తువులను అనుమతించరు.
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే అనుమతి..

- మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకూ పరీక్ష జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే విద్యార్థులు, సిబ్బందిని అనుమతిస్తారు.
- పరీక్ష హాల్లో ప్రతి విద్యార్థీ ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, గ్లౌజులు ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి.
- ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశాల్ని కల్పిస్తారు.
- పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, బ్యాగులు సహా ఇతరత్రా వ్యక్తిగత వస్తువులకు అనుమతి లేదు.
- పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కించేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాలాజలాన్ని వాడరాదు.
- ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కృష్ణా, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 151 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.
- 2019లో ఏపీ నుంచి 57,755 మంది దరఖాస్తు చేయగా, ఇప్పుడా సంఖ్య 61,892కు పెరిగింది.
- ఈ ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో 2,28,914 మంది పరీక్ష రాస్తుండగా, అత్యల్పంగా మిజోరాంలో 1,741 మంది రాస్తున్నారు.
దేశవ్యాప్తంగా పరీక్ష రాస్తున్నవారు | 15,97,433 |
దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు | 3,842 |
ఏపీలో పరీక్ష రాస్తున్నవారు | 61,892 |
ఏపీలో పరీక్ష కేంద్రాలు | 151 |
టీఎస్లో పరీక్ష రాస్తున్నవారు | 55,800 |
టీఎస్‌లో పరీక్ష కేంద్రాలు | 112 |
Published date : 12 Sep 2020 01:18PM