ఫిబ్రవరి 26 నుంచి ఏపీ ఎడ్ సెట్–2020 కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఎడ్ సెట్–2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్ లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు ఫిబ్రవరి 26 తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. మార్చి 5వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్లను ఈ నెల 26 నుంచి మార్చి 3 వరకు నమోదుకు అవకాశమిచ్చారు.
వర్సిటీలు, తేదీల వారీగా ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన ఇలా..
వర్సిటీలు, తేదీల వారీగా ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన ఇలా..
వర్సిటీ | ఫిబ్రవరి 26న | ఫిబ్రవరి 27న | ఫిబ్రవరి 28న |
ఏయూ | 1–4000 | 4001–8000 | 8001–చివరి ర్యాంకు |
జేఎన్‌టీయూకే | 1–4000 | 4001–8000 | 8001–చివరి ర్యాంకు |
నాగార్జున | 1–5000 | (స్పెషల్ కేటగిరి) | 5001–చివరి ర్యాంకు |
ఎస్వీయూ | 1–4000 | 4001–8000 | 8001–చివరి ర్యాంకు |
ఎస్కేయూ | 1–4000 | 4001–8000 | 8001–చివరి ర్యాంకు |
Published date : 23 Feb 2021 05:03PM