ప్రభుత్వరంగంలోనూ తాత్కాలిక ఔట్‌సోర్సింగ్ ప్రాతిపాదికన వైద్యుల పోస్టుల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో పనిచేసేందుకు తాత్కాలిక ఔట్‌సోర్సింగ్ ప్రాతిపాదికన వైద్యులను నియమించేందుకు ఆ విభాగం ఔత్సాహిక వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
వారికి ఏప్రిల్ 20, 22వ తేదీల్లో సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. www.hyderbad.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులను పొందాల్సిందిగా హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ సూచించారు. అదే విధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్)లో నర్సింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించడంతో 3 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం.
Published date : 29 Apr 2021 03:39PM