పోలీస్ పోస్టుల భర్తీకి కార్యాచరణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ పోస్టుల భర్తీకి కార్యాచరణ మొదలైంది.
పోలీస్ శాఖలోని పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ఈ నెల 21న జరిగిన పోలీస్ అమరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఏటా 6,500 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జిల్లాలు, నగర పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియజేయాలంటూ ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్‌లకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 26 Oct 2020 12:52PM