Skip to main content

పీజీఈసెట్- 2020 ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన టీఎస్ పీజీఈసెట్-20 పరీక్ష ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 22 కేంద్రాల్లో గత నెల 21 నుంచి 24 వరకు 19 సబ్జెక్టుల్లో పీజీఈసెట్ పరీక్షలు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో జరిగాయి. ఈ పరీక్షల కోసం 22,282 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 16,807 మంది పరీక్షలు రాశారు. వీరిలో 14,456 మంది (86.01 శాతం) క్వాలిఫై అయ్యారు. వీరిలో బాలికలు 6,663 (39.64%) మంది, బాలురు 7,793 (46.37%) మంది ఉన్నారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సెట్ వర్గాలు సూచించాయి.
Published date : 17 Oct 2020 03:00PM

Photo Stories