పీజీఈసెట్- 2020 ఫలితాలు విడుదల
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2020 ఫలితాలను ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
ప్రవేశ పరీక్షకు 28,898మంది దరఖాస్తు చేయగా 22,911 మంది హాజరయ్యారని తెలిపారు. వీరిలో 20,157 (87.98 శాతం) మంది అర్హత సాధించారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో 17,150 మంది హాజరవగా 14,775 (86.15 శాతం) మంది అర్హత సాధించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 365 కళాశాలల్లో 27,300 సీట్లు భర్తీ చేస్తారని తెలిపారు. ఫార్మసీ విభాగంలో 5,761 మంది పరీక్షకు హాజరవగా 5,382 (93.42%) మంది అర్హత సాధించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 కళాశాలల్లో 2,787 సీట్లు భర్తీ చేస్తారన్నారు. త్వరలో కౌన్సెలింగ్ తేదీలను వెల్లడిస్తామన్నారు.
Published date : 24 Oct 2020 04:29PM