పేపర్ లీక్.. ఆర్మీ పరీక్ష రద్దు!!
Sakshi Education
న్యూఢిల్లీ: భారత ఆర్మీ నిర్వహించే ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ సోల్జర్స్’ పరీక్ష పేపరు లీకైనట్లు తేలడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు ఆదివారం వెల్లడించారు.
ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ‘సరైన అభ్యర్థుల ఎంపిక కోసం జరిగే పరీక్షకు సంబంధించి ఇలాంటి అవకతవకలు జరిగితే సహించేది లేదు’ అంటూ ఆర్మీ అధికారి వివరణ ఇచ్చారు. పుణే పోలీసులతో కలిపి ఆర్మీ అధికారులు నిర్వహించిన శోధనలో పరీక్ష పేపరు లీకైనట్లు నిర్ధారణ అయింది. నిందితులు దొరికినప్పటికీ, పారదర్శకత కోసం పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Published date : 01 Mar 2021 04:30PM