న్యాయ విద్యలో సమూల మార్పులు అవసరం
Sakshi Education
అనంతపురం లీగల్: న్యాయ విద్యలో సమూల మార్పులు అవసరమని, వృత్తిపర అంశాలపై శిక్షణ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ అన్నారు.
ఫిబ్రవరి 21వ తేదీన అనంతపురంలోని శ్రీ విజయనగర న్యాయ కళాశాలలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న వారు వృత్తిలో చేరిన తర్వాత ఎదుర్కొనే అంశాలను ముందుగా ఆకళింపు చేసుకోవటానికి.. ఈ శిక్షణ ఉపకరిస్తుందని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బార్ కౌన్సిల్ రూపొందించిన ఇంటర్న్‌షిప్ ద్వారా శిక్షణ పొందటం వల్ల వృత్తిలో విలువలు పెరుగుతాయన్నారు. ప్రొఫెసర్ జె.విజయకుమార్, న్యాయవాది పి.గురుప్రసాద్ మాట్లాడుతూ.. న్యాయవాద విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
Published date : 22 Feb 2021 05:38PM