నవంబర్25 వరకు బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు ముగిసినందున ఆలస్య రుసుము రూ.వెయ్యి చెల్లించి ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ శాఖ తెలిపింది.
ఇంటర్మీడియెట్ పాస్ కావడంతో పాటు ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులని ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాలు www.fcrits.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపింది. ఈ కోర్సుకు సంబంధించి ఈ ఏడాది (2020-21) నుంచి పేమెంట్ కోటా సీట్లను ప్రవేశపెట్టారు. బుధవారం (18వ తేదీ) నుంచి 25వ తేదీ వరకు దీనికి సంబంధించి దరఖాస్తులను స్వీకరి స్తారు. ఈ కోటాలో సీటు కోసం ఫీజు రూ.3 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఇంటర్‌తో పాటు ఎంసెట్‌లో ర్యాంక్ కలిగి ఉండాలి. వివరాలకు వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 08454-236510లో సంప్రదించవచ్చని అటవీ శాఖ తెలిపింది.
Published date : 19 Nov 2020 02:44PM