Skip to main content

నవంబర్ 19 నుంచి ఎంసెట్ బైపీసీ ప్రవేశాల కౌన్సెలింగ్.. షెడ్యూల్ ఇదిగో!

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ బైపీసీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభిం చేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలును నవంబర్ 13న జారీ చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా బీఫార్మసీ, ఫార్మ్-డీ, బయోటెక్నాలజీ (బైపీసీ) కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టనుంది. రెండు దశల్లో ఈ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు.

మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూలు:
నవంబర్ 19, 20: రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
నవంబర్ 20, 21: స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నవంబర్ 20 నుంచి 22 వరకు: వెబ్ ఆప్షన్లు
నవంబర్ 24: సీట్ల కేటాయింపు
నవంబర్ 24-27 వరకు: ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్

చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూలు:
డిసెంబర్ 1: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
డిసెంబర్ 2: ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
డిసెంబర్ 2, 3: వెబ్ ఆప్షన్లు; డిసెంబర్ 5: సీట్లు కేటాయింపు
డిసెంబర్ 5 నుంచి 7 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, రెండు దశల్లో సీట్లు పొందిన వారు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్
డిసెంబర్ 5: వెబ్‌సైట్‌లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు.
Published date : 16 Nov 2020 03:38PM

Photo Stories