నీట్- 2020 లో మెరిసిన గురుకుల విద్యార్థులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్- 20 పరీక్షలో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు.
తాజా ఫలితాల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ గురుకుల సొసైటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధించారు. మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ల సొసైటీ నుంచి ఈ ఏడాది 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. వారంతా అర్హత సాధించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నుంచి 350 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 142 మంది అర్హత సాధించారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నుంచి 210 మంది పరీక్ష రాయగా, 48 మంది అర్హత సాధించారు.
Published date : 19 Oct 2020 04:25PM