Skip to main content

నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలన: ఒక్కో పోస్టుకు ఇద్దరికి కాల్‌లెటర్లు

సాక్షి, అమరావతి: జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది.
సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌లో నిర్వహించిన 14 రకాల రాతపరీక్షల ఫలితాలను అక్టోబర్ 27న ప్రకటించిన విషయం తెలిసిందే. కలెక్టర్ నేతృత్వంలో జిల్లాల్లో వివిధ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా సెలక్షన్ కమిటీలు మెరిట్ ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున కాల్‌లెటర్లు పంపాయి. గ్రామ, వార్డు సచివాలయం వెబ్‌సైట్‌లోనూ ఆయా అభ్యర్థుల కాల్‌లెటర్లను అప్‌లోడ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కాల్‌లెటర్లు అందుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆయా జిల్లాల్లో మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు పరిశీలిస్తారు. అభ్యర్థి ఏ జిల్లాలో దరఖాస్తు చేసుకున్నారో ఆ జిల్లా పరిధిలో పేర్కొన్న పోస్టులకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. నిబంధనల ప్రకారం.. ఇప్పుడు జిల్లా మార్పునకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 18,048 పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నారు. ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ నెల 11 నుంచి అందజేస్తారు.
Published date : 03 Nov 2020 04:26PM

Photo Stories